Brain Eating Amoeba First Case Registered In South Korea: అసలే కరోనా కొత్త వేరియెంట్ బీఎఫ్.7 మరోసారి ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్న ఈరోజుల్లో.. తాజాగా మరో భయంకరమైన వ్యాధి పుట్టుకొచ్చింది. దాని పేరే ‘నాయ్‌గ్లేరియా ఫాలెరీ’. దీనిని ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా (మనిషి మెదడు దినే అమీబా) అని కూడా అంటారు. ఆల్రెడీ ఈ వ్యాధి సోకి ఒక వ్యక్తి మరిణించినట్లు.. దక్షిణ కొరియా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. డిసెంబర్ 10వ తేదీన థాయ్‌లాండ్ నుంచి కొరియా వెళ్లిన వ్యక్తి (50).. ఆ మరునాడే ఆసుపత్రిలో చేరాడు. గత మంగళవారం చనిపోయాడని సోమవారం అధికారులు వివరించారు. ఇతడు ఏ వ్యాధితో చనిపోయాడన్న విషయం తేల్చడానికి ఆ వారం రోజుల గ్యాప్ పట్టింది.
Inaya Sultana: సోహెల్‌కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా..!!
తొలిసారి ఈ అమీబా 1937లో అమెరికాలో వెలుగుచూసింది. ఈ వైరస్ కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా ఈ వైరస్ లోపలికి ప్రవేశించి.. మెదడును తినడం మొదలుపెడుతుంది. ఇది లోనికి ప్రవేశించిన ఐదు రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి. తలనొప్పి, తీవ్ర జ్వరం, వికారం, వాంతులు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ మూర్చపోవడం, గందరగోళం, కోమా వంటి తీవ్రమైన లక్షణాలు వస్తాయి. ఇలా లక్షణాలు వచ్చిన ఐదు నుంచి 18 రోజుల్లోపు మరణం సంభవించవచ్చు. 1962 నుంచి 2021 వరకు మొత్తం 154 మంది ఈ వ్యాధి బారిన పడగా.. కేవలం నలుగురు మాత్రమే దీన్నుంచి బతికి బయటపడ్డారు. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువ. అయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Stump Out: టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన సీన్.. 145 ఏళ్ల పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
ఈ వైరస్ నివసించే ప్రాంతాల్లో.. అంటే కొలనులు, కాలువల దగ్గర ప్రజలు అప్రమత్తగా ఉండాల్సిందిగా వైద్య నిపుణులు సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా.. కొలనుల్లో ఈత కొట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదు అవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మందికి ఈ వ్యాధి సోకగా.. 97% మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, భారత్, చైనాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవ్వగా.. ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియాలో తొలి కేసు వెలుగుచూసింది.