Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు.
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్‌తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి…
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అమరులయ్యారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. శత్రుదేశం పాక్ కాల్పుల్లో మన దేశానికి…
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్‌లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
India Pak War : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగనున్న భారత్-పాకిస్థాన్ ల తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య జరగనున్న “తొలి శాంతి చర్చలు” ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల “మిలిటరీ ఆపరేషన్స్” డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం…
Attaullah Tarar : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే, పాక్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత సాయుధ బలగాలు కఠినంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించిన అనంతరం, పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందిస్తూ—”పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయదు” అని స్పష్టం చేశారు. “ప్రజలు విజయోత్సవాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో అలాంటి చర్యలకు తావే లేదు. పాకిస్థాన్ వైపు…
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు.…
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.
IMF: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 8,500 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు మరింత అవకాశం లభించింది. అయితే, ఈ ఆర్థిక సహాయం భారత్‌కు మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ నిధులను విడుదల చేయడానికి కొన్ని షరతులు విధించినప్పటికీ,…