భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. “కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.” అని ట్రంప్ పేర్కొన్నారు.
READ MORE : IND PAK War: ‘మా పని కాదు..’ నుంచి ‘కాల్పుల విరమణ’ వరకు.. అమెరికా వైఖరి ఏంటి?
1980 నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాగా.. 2010 నుంచి 2020 సెప్టెంబర్ వరకు దాదాపు 11,572 సార్లు పాకిస్థాన్ సరిహద్దుల్లో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనల్లో దాదాపు 240 మంది భారతీయలు(122 మంది ప్రజలు, 118 మంది భద్రతా బలగాలు) చనిపోయారు. 673 మంది పౌరులు, 594 మంది సైనికులు గాయపడ్డారు.
1972లో నియంత్రణ రేఖను నిర్ధరించిన అనంతరం సరిహద్దుల్లో దాదాపు 10ఏళ్ల పాటు ఎటువంటి ఉద్రిక్తతలు జరగలేదు. 1980 నుంచి యుద్ధ ట్యాంకులతో గస్తీ (సీఎఫ్వీ) జోరందుకోగా.. 1990లో కశ్మీర్లో తిరుగుబాటు తారాస్థాయికి చేరుకునే నాటికి ఇరుదేశాలు పూర్తి బలగాలను మొహరించాయి. 2001లో భారత్ తన సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మించడం ప్రారంభించిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద కాల్పులు తీవ్రతరం అయ్యాయి. 2003 తర్వాత ఇరుదేశాలు యుద్ధ ట్యాంకులను దాదాపు 5 ఏళ్లపాటు నిషేధించాయి. ఈ దేశాల మధ్య ఆ సమయంలో జరిగిన చర్చలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే ముంబయిలో 2008 ఉగ్రదాడుల తర్వాత శాంతి చర్చలకు తావు లేకుండా పోయాయి.
READ MORE : Anasuya : నడుము అందాలతో రెచ్చిపోయిన అనసూయ..
క్రమంగా సరిహద్దుల్లో యుద్ధట్యాంకుల అలజడి పెరిగింది. 2013లో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు ఎక్కువయ్యాయి. ప్రతి ఏడాది అవి గణనీయంగా పెరుగుతున్నాయి. 2017లో భారత్ 1,970 సార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 2018లో పాకిస్థాన్ 936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత్ ఆరోపించింది. ఆనాటికి 15 ఏళ్లలోనే ఆల్టైమ్ రికార్డది. 2018 మే నెలలో జమ్ముకశ్మీర్లో.. భారత్ నాన్-ఇనీషియేషన్ ఆఫ్ కాంబాట్ ఆపరేషన్లను ప్రకటించింది. దీన్నే రంజాన్ కాల్పుల విరమణ అంటారు. ఇది 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొనసాగింపు. అయితే కాలక్రమేణ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని.. 2019, 2020లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి నుంచి కూడా 2025 వరకు పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ వస్తోంది. తాజాగా అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలి.