భువనగిరి ఎంపి ఎన్నికలలో బిజేపి 32 శాతం ఓట్లు తెచ్చుకుందని, పార్లమెంట్ ఎన్నికలలో బిజేపి గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని అసత్యప్రచారాలతో ప్రజలను నమ్మించారన్నారు మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన జనగామ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచి మంత్రులు పర్యటన పేరుతో కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. హిందువులు హింసావాదులని, ముస్లింలు,క్రైస్తవులు అహింసా వాధులని రాహుల్ గాంధీ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులకు బోనస్ అని చెవులో పువ్వులు పెట్టారని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందన్నారు బూర నర్సయ్య గౌడ్. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు.