తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై, మోసపూరిత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణులపై దాడులకు, లాఠీచార్జ్ లకు పాల్పడుతూ అణచివేయాలని చూస్తోంది అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను అణచివేయాలని చూడటం దుర్మార్గ చర్యే అని ఆయన వ్యాఖ్యనించారు. కార్యకర్తలు తలుచుకుంటే మీకంటే ఎక్కువ హింసాయుత రాజకీయాలు చేయగలరని హెచ్చరించాడు.
Read Also: BRICS Summit: బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ సంభాషణలు
పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఉద్యోగులు కాదు.. వారి బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాలని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించొద్దు.. లేదంటే మిలియన్ మార్చ్ తరహాలో ప్రగతిభవన్ ముట్టడిస్తామని మాజీ ఎంపీ ప్రకటించారు. ఆర్ఎస్ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సాహసోపేతమైన చర్యగా చెప్పుకుంటోంది. అయితే బీఆర్ఎస్ నేతలవి మేకపోతు గాంభీర్యమేనని ఆయన కామెంట్స్ చేశాడు.
Read Also: Life Tax On EV’s: ఎలక్టిక్ వాహనాలకు ఇకపై ఆ పన్ను కట్టాల్సిందే.. మినహాయింపుకు ఇక సెలవు
అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు కేటాయించడం వెనుక ఉద్దేశం ఏంటని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజకీయ వెట్టిచాకిరికి అలవాటుపడి ఉన్నారు.. వారంతా సీఎం కోసం పడిగాపులు కాయడానికి అలవాటుపడ్డారు.. బాధను కూడా ఆనందించే జబ్బు (మెసోడిజం)తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అనకొండల్లాగా అవినీతి సొమ్ముతో ఒక్కో చిన్న రాష్ట్రాలను పెట్టుబడి పెట్టె అంత సంపాదించారు అని బూర ఆరోపించారు. వారిని తొలగిస్తే.. కొత్త అభ్యర్థిని ఓడిస్తారని కేసీఆర్ కి భయం పట్టుకుందని ఆయన చెప్పారు.
Read Also: Asia Cup 2023: మార్పులు అవసరం లేదు.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ సెలెక్టర్!
కేసీఆర్ ది ఫ్యూడల్ డీఎన్ఏ.. వేసుకునే బట్టల నుంచి వ్యవస్థలో విధానాల వరకు ఫ్యూడలిజమే.. ప్రపంచంలో నెంబర్-1 బినామీ పొలిటీషియన్ కేసీఆర్. లక్ష కోట్ల ధనమున్న ఆయనే ఓటమి భయంతోనే రెండుచోట్ల పోటీకి దిగుతున్నాడు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీసీ వ్యతిరేకి కేసీఆర్.. బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించకుండా దుర్మార్గ వైఖరితో వ్యవహరిస్తున్నాడు.. కామారెడ్డిలో కూడా బీసీ నేత గంప గోవర్ధన్ కి మొండిచేయి చూపి.. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.. ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం.. గౌడ సామాజిక వర్గంలో పాత వారికే నలుగురికి టిక్కెట్లు కేటాయించుకున్నారు.. యాదవ సామాజిక వర్గంలో గతంలో ఉన్న ఐదురికే టిక్కెట్లు ఇచ్చారు.. కురుమలు, రజకులు, కుమ్మరులు, వడ్డెర, లింగాయత్, విశ్వకర్మలు, బోయ వాల్మీకి, మేదర, గంగపుత్రులు సహా బీసీల్లోని మిగతా సామాజిక వర్గాల నుంచి బీఆర్ఎస్ కు టిక్కెట్లు కేటాయించకుండా బీసీ ద్రోహి పార్టీగా వ్యవహరిస్తోంది అని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: PM Modi: 2024 నుంచి బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలు
తెలంగాణలో కోటి 60 లక్షల మేర ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గం ఆలోచించుకోవాలి అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలి.. తొలి బీసీ ప్రధానిని చేసింది బీజేపీ పార్టీనే.. 29 కేంద్ర మంత్రులను చేసింది బీజేపీనే.. బీసీలకు న్యాయం చేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే.. రూ. 13 వేల కోట్లతో విశ్వకర్మ యోజనను ప్రారంభించింది.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీలకు స్వర్ణయుగం వస్తుంది అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.