బీజేపీ హర్ ఘర్ తిరంగ అంటుంటే… కేసీఆర్ హర్ ఘర్ మద్యం సీసా అంటున్నారని విమర్శించారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 60 వేల బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, గౌడ్ లకు, ఎస్టీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించారు.. దరఖాస్తు కోసం రెండు లక్షల రూపాయల నాన్ రిఫండ్ ఫీజు పెట్టారని ఆయన మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజానీకానికి మద్యం దుకాణం దరకాస్తు చేసుకునే అవకాశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. వందల కోట్ల విలువ చేసే భూముల వేలంలో పాల్గొనేందుకు లక్ష రూపాయలు పెట్టీ… మద్యం దుకాణాలకు రెండు లక్షలు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆయన అన్నారు.
Also Read : Honor 90: హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త మోడళ్లతో ఇండియాలోకి రీఎంట్రీ
కేసీఆర్ పక్కన శకుని లాగా సోమేష్ కుమార్ ఉన్నారని, మద్యం దుకాణాలకు దరఖాస్తు పెట్టుకోవాలంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. దేశంలో అత్యధికంగా మద్యం రెట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన ఆరోపించారు. రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ తెలంగాణ లో 880 రూపాయలు అయితే యూపీలో 560 రూపాయలు మాత్రమేనని, గౌడ్ లకు సంబంధించి రిజర్వేషన్ చేసిన మద్యం దుకాణాలను.. గీత కార్మికుల సొసైటీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీలకు సంబధించిన రిజర్వేషన్ చేసిన మద్యం దుకాణాలకు టెండర్ వేయడానికి 25 వేల రూపాయలు మాత్రమే పెట్టాలని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎలైట్ షాప్స్ కేవలం కేసీఆర్ బినామీలే తీసుకుంటున్నారని, ఉడ్తా తెలంగాణ చేయవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు. బెల్ట్ షాప్స్ తొలగించాలని బూర నర్సయ్య డిమాండ్ చేశారు.
Also Read : New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!