దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. స్కూళ్లు, కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులతో పాటు రెండు సీఆర్పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబ్ బెదిరింపులు వచ్చాయి
Bomb Threats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు తీవ్ర అలజడి రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ- మెయిల్స్ వచ్చాయి.
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం నుంచి వరుసగా ఢిల్లీ స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈమెయిల్ బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
Bomb Threat: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గల పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 5) ఉదయం నాలుగు ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్దీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన కేసులో 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపులన్నీ బూటకమని తేలింది.
బాంబు పేలుళ్ల బెదిరింపుతో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది.