జబల్‌పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్‌పూర్‌లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు.
కెనడాలో ఒకేసారి 125 సంస్థలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మాల్స్, ఆస్పత్రులకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులన్నీ ప్రధానంగా యూదులు లక్ష్యంగా వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
Bomb threats: కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పలు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. ఇదిలా ఉంటే సోమవారం అహ్మదాబాద్‌లో పలు స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని పాఠశాలలక ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb threats to Spice Jet flight: ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు విమానాన్ని క్షణ్ణంగా సోదా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు.