తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఇప్పటి వరకు బెదిరింపులే రాగా.. ఈసారి మాత్రం గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి. ఇలా తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి.
Bomb threats: విమానయాన సంస్థలకు బూటకపు బెదిరింపులు తప్పట్లేదు. దాదాపుగా రెండు వారాలుగా దేశంలోని అన్ని ఎయిర్‌లైనర్లకు నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా 32 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 400కి పైగా విమానాలు బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. ఈ కాల్స్ నేపథ్యంలో కేంద్రం ఏజెన్సీలు అత్యున్నత దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. Read Also: Triumph: ఇండియాలో…
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు.. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం అన్నారు.. నగరంలో భద్రత పెంచాం.. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం.. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు…
Lucknow Hotels Bomb Threats: లక్నోలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. ఇందులో హోటల్ ఫార్చ్యూన్, హోటల్ లెమన్ ట్రీ, హోటల్ మారియట్ సహా 10 పెద్ద హోటళ్ల పేర్లు ఉన్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా హోటళ్లను బాంబులతో బెదిరించారు. అంతకుముందు కూడా బాంబు పేలుస్తామని బెదిరిస్తూ అగంతకులు పాఠశాలలకు ఇలాంటి మెయిల్స్ పంపారు. ఈ హోటళ్లలో బాంబుల నివేదికల మధ్య, ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలకు సంబంధించి కూడా పెద్ద…
Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ నగరంలోని పలు హోటళ్లకు వరసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటల్లకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రసిద్ధ హోటళ్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా నగరం అంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన పెంచాయి.
Bomb threats: వరసగా బాంబు నకిలీ బాంబు బెదిరింపులు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈ రోజు మరో 6 ఇండిగో విమానాలు కూడా ఇదే తరహా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి.
Hoax Bomb Threats: వరసగా నకిలీ బాంబు బెదిరింపులు ఇండియా విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. భారత విమానయాన రంగాన్ని నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఈ నకలీ బెదిరింపుల వల్ల ఏయిర్‌లైన్ సంస్థలు కోట్లలో నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండర్, జర్మనీ నుంచి వచ్చాయని తెలుస్తోంది. కావాలనే భారత విమానాలను టార్గెట్ చేస్తు్న్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Bomb Threats: విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. బాంబు బెదిరింపు కారణంగా ప్రతిరోజు విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శనివారం 10 వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఐదు విమానాలు ఇండిగోకు చెందినవి కాగా.. ఐదు విమానాలు ఆకాసా ఎయిర్‌లైన్స్‌కు చెందినవి. సమాచారం ప్రకారం, 6E108 హైదరాబాద్-చండీగఢ్, 6E58 జెడ్డా-ముంబై, 6E17 ముంబై-ఇస్తాంబుల్, 6E184 జోధ్‌పూర్-ఢిల్లీ, 6E11 ఢిల్లీ-ఇస్తాంబుల్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది.…
గత మూడు రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. వరుసగా బెదిరింపులు రావడంతో అటు విమాన సంస్థలు, ఇటు పోలీసులు పరుగులు పెట్టారు. ఇలా మూడు రోజులు ప్రయాణికులకు తీవ్ర అవస్థలు ఏర్పడ్డాయి.