అశ్లీల చిత్రాల మేకింగ్, వాటిని యాప్ లలో షేర్ చేయడం వంటి ఆరోపణలతో జూలై 12న రాత్రి రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు లభించాయట. క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుంద్రా 122 అడల్ట్ సినిమాల నిర్మాణానికి 9 కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష పెళ్లి ?
అసలు గుట్టంతా రాజ్ కుంద్రా ఫోన్ లోనే దాగుందట. అందుకే ఆయన ఫోన్ వాట్సప్, చాటింగ్, కాల్ లిస్ట్ ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇక పోర్న్ సినిమాలలో వచ్చిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టినట్టు క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా హవాలాకు పాల్పడినట్టుగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రాజ్ కుంద్రాకు చెందిన ఎస్ బ్యాంక్ ఖాతా నుండి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతాల మధ్య భారి లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 7.5 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టి సోదరి శమిత శెట్టీని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించనున్నారు.