‘దబంగ్ 1, 2, 3 అండ్ 4’… ఏది మీకు బాగా ఇష్టం అనగానే… సల్మాన్ ‘దబంగ్ 4’ అంటూ సమాధానం ఇచ్చేశాడు! కానీ, అసలు ‘దబంగ్ 4’ మూవీనే రాలేదు కదా అంటారా? అది తెలియాలంటే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ చాట్ షో ‘క్విక్ హీల్ పించ్’ గురించి తెలుసుకోవాలి!
కొద్ది రోజుల క్రితం ‘క్విక్ హీల్ పించ్’ సీజన్ 2 మొదలైంది యూట్యూబ్ లో! దాదాపు అరగంట సేపు బీ-టౌన్ సెలబ్స్ ని ఒక్కొక్కర్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు అర్భాజ్. సీజన్ వన్ లో మాదిరిగానే ఈ సీజన్ టూలో కూడా ఆన్ లైన్ ట్రోలర్స్ ని ఈ చాట్ షోలో టార్గెట్ చేశారు.
read also : 225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
బాలీవుడ్ సెలబ్రిటీల్ని ట్రోల్ చేసేవారికి ‘పని లేదని, వారు దండగని’ చెప్పటమే ఈ టాక్ ఉద్దేశం! అయితే, ట్రోలర్స్ సంగతి, ఆ ట్రోలర్స్ ని ట్రోల్ చేద్దామని ప్రయత్నించే బాలీవుడోళ్ల సంగతి పక్కన పెడితే… సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ లో సల్మాన్ కనిపించాడు. తమ్ముడు అర్భాజ్ తో కబుర్లు చెబుతూ పెద్ద బ్రేకింగ్ న్యూ అందించాడు. ఇంతకీ, ‘దబంగ్’ ఖాన్ ఏమన్నాడంటే… ‘దబంగ్ 4’ అంటే నాకు చాలా ఇష్టం అని ఓ ప్రశ్నకి బదులిచ్చాడు సల్మాన్. దానికి ఆశ్చర్యపోయినట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన అర్భాజ్ “దబంగ్ 4… కన్ ఫర్మ్ చేసినట్టేనా?” అని అడిగాడు!
అవునన్నాడు సల్మాన్! అలా తన ‘చుల్ బుల్ పాండే’ క్యారెక్టర్ నాలుగోసారి తెర మీదకు రాబోతోందని భాయ్ జాన్ క్లారిటీ ఇచ్చేశాడు. ట్విస్ట్ ఏంటంటే… ‘దబంగ్’ సూపర్ హిట్టైనప్పటికీ ‘దబంగ్ 2, 3’ క్రమంగా బలహీనపడుతూ వస్తున్నాయి. ‘దబంగ్ 3’ విషయంలో అయితే క్రిటిక్స్, ఆడియన్స్ అందరూ విమర్శలు చేశారు. అయినా, సల్మాన్ యాజ్ యూజ్ వల్, వెనక్కి తగ్గేదే లే… అంటూ ‘దబంగ్ 4’ అనౌన్స్ చేసేశాడు! చూడాలి మరి, నెక్ట్స్ ‘టైగర్ 3’ సీక్వెల్ తో రాబోతోన్న కండల వీరుడు ‘దబంగ్’కి ఎప్పుడు ముహూర్తం నిర్ణయిస్తాడో…