గన్ గురి పెట్టి భారీ దొంగతనం… షాక్ లో హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటికి జీవితంలో మర్చిపోలేని షాకింగ్ ఘటన ఎదురైంది. ఆమెకు గన్ గురి పెట్టి ఏకంగా లక్షల్లో దోపిడీ చేశారట దొంగలు. ఈ షాకింగ్ ఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… నటి నికితా రావల్ బాలీవుడ్ తో పాటు దక్షిణ భారతీయ సినిమాలలో మంచి ఆర్గనైజర్, పెర్ఫార్మర్‌గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆమె “మిస్టర్ హాట్ మిస్టర్ కూల్”, “ది హీరో – అభిమన్యు”, “గరం మసాలా”, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం “క్యూట్ కామినా” వంటి సినిమాల్లో నటించింది. తాజా సమాచారం ప్రకారం నికితా రావల్ గత వారం దేశ రాజధానిలో తన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది రాబర్స్ ఆమెను తుపాకీతో ఏడు లక్షలకు పైగా దోచుకెళ్లారు. ఆ తర్వాత ఆమె భయంతో ఢిల్లీ నుంచి ముంబై వచ్చేసిందట.
Read Also : బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
నికితా రావల్ మాట్లాడుతూ “రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నేను అత్త ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఇన్నోవా అతి వేగంగా వచ్చి నా వాహనాన్ని ఆపివేసింది. ఆపై నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు నుండి బయటకు వచ్చి నాకు తుపాకీని చూపించారు. నా దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇచ్చేయమని బెదిరించారు” అని చెప్పుకొచ్చింది. నికితా రావల్ చెప్పినదాని ప్రకారం ఆ దొంగలు ఆమె ఉంగరాలు, డైమండ్ లాకెట్టు, గడియారం, చెవిపోగులు, నగదును దోచుకున్నారు. మొత్తం వాటి విలువ సుమారు రూ.7 లక్షలట. ఈ షాకింగ్ ఘటనతో తాను చాలా డిస్టర్బ్ అయ్యానని నటి తెలిపింది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఆమె సరిగ్గా తినలేకపోతోందట. అలాగే నిద్ర పట్టడం లేదని వాపోయింది. ప్రస్తుతం ఈ విషయం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!