ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా గురించి బాగా విన్పిస్తోంది. ముఖ్యంగా భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవడం, అది గ్రాంట్ కావడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా సూపర్ స్టార్లుగా పిలవబడే స్టార్స్ కు ఈ వీసా లభిస్తోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్, బి టౌన్ నిర్మాత బోనీ కపూర్ కు గోల్డెన్ వీసా లభించడం విశేషం. మంగళవారం ఆయన ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబానికి 10 సంవత్సరాల ప్రతిష్టాత్మకమైన దుబాయ్ గోల్డెన్ వీసా రావడం ఎంతో సంతోషమని ఆయన తెలిపారు. ఈ 65 ఏళ్ల నిర్మాత తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సంతోషకరమైన వార్తలను పంచుకున్నారు.
“నాకు, నా కుటుంబానికి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దుబాయ్ ప్రభుత్వానిది డైనమిక్ నాయకత్వం. ఉత్తమ గమ్య స్థానం.. దుబాయ్” అంటూ ట్వీట్ చేశారు.
Read Also : త్వరగా చర్య తీసుకోండి.. ఆ కుటుంబానికి న్యాయం చేయండి: మహేష్ బాబు
గోల్డెన్ వీసాను 2019లో యూఏఈ ప్రభుత్వం పెట్టుబడి దారులు (కనీసం 10 మిలియన్ AED), వ్యవస్థాపకులు, అలాగే సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలో నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించే కొత్త వ్యవస్థగా ఏర్పాటు చేసింది. ఈ గోల్డెన్ వీసాలు ఐదు లేదా 10 సంవత్సరాలు జారీ దుబాయ్ ప్రభుత్వం చేత జారీ చేయబడుతుంది. పదేళ్ల తరువాత ఈ వీసా దానికదే రెన్యువల్ అవుతుంది.
గతంలో దుబాయ్ గోల్డెన్ వీసా పొందిన సినీ తారలలో షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, మమ్ముట్టి, మోహన్ లాల్, టోవినో థామస్ ఉన్నారు. మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ఇటీవలే ఈ గోల్డెన్ వీసాను పొందిన విషయం విదితమే.
ఇక బోనీ కపూర్ విషయాని కొస్తే “మిస్టర్ ఇండియా, వాంటెడ్ లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన “మైదాన్” తో పాటు కోలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”ను తెరకెక్కిస్తున్నాడు.