ఇటీవల కాలంలో భాషలతో సంబంధం లేకుండా నటీనటులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా అన్ని భాషల నటీనటులను ఆదరిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇటీవల “షేర్షా”గా వచ్చి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా కోలీవుడ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక నెల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘షేర్‌షా’ విడుదలైంది. కార్గిల్ యుద్ధ హీరో విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ ఆకట్టుకున్నాడు. ‘బిల్లా’ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా, ఆయన ప్రేయసి డింపుల్ చీమగా కియారా అద్వానీ నటించారు.
Read Also : మరోసారి తెరపైకి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్
తాజాగా సిద్ధార్థ్ ట్విట్టర్‌లో సంభాషిస్తూ అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ట్విట్టర్‌లో అభిమానులతో ఇంటరాక్షన్ సమయంలో ఓ నెటిజన్ “నేను మీకు పెద్ద అభిమానిని. తమిళ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?” అని అడిగారు. తమిళ ప్రేక్షకులు ఆయన నటనను ఇష్టపడతారని, త్వరగా ఒక తమిళ సినిమా చేయమని అడిగాడు. అభిమానికి సిద్ధార్థ్ సమాధానం ఇస్తూ “అయితే సరే” అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు “మిషన్ మజ్ను”తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక కూడా ఈ సెషన్ లో భాగమై “మేము కూడా చూస్తాము” అంటూ నవ్వుతున్న ఎమోజిని జత చేసింది. దీంతో సిద్ధార్థ్ హీరోగా గనుక తమిళ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందంటే రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Ok then 😊😉 https://t.co/RsfYUeCqsd
— Sidharth Malhotra (@SidMalhotra) September 16, 2021