బోల్డ్ ఫొటోతో కంగనా మరో వివాదం.. వాళ్లకి కూడా మూడ్ తెప్పించేలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు… నిత్యం ఆమె వివాదాలతోనే జీవిస్తోంది. ఇక ఇటీవల పద్మశ్రీ అందుకున్న హాట్ బ్యూటీ భారత స్వాతంత్య్రం గురించి కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. సరే కొద్దిరోజుల్లో ఆ వివాదం ముగుస్తుంది అనుకోనేలోపు సిక్కు మతాల గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి.
ఇక ఈ కేసుపై కంగనా కొంచెం ఘాటుగానే స్పందించింది. తన బోల్డ్ ఫొటోతో సమాధానం చెప్పి కొత్త వివాదానికి నాంది పలికింది. తాజాగా అమ్మడు ఒక బోల్డ్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ టూ పీస్ డ్రెస్ లో మందు గ్లాస్ చేతపట్టి సెక్సీ లుక్ లో దర్శనమిచ్చింది. ఆ ఫోటో చూస్తే ఎవరికైన మతిపోవాల్సిందే.. ‘ఇంకోరోజు ఇంకో ఎఫ్ఐఆర్. ఒకవేళ వారు నన్ను అరెస్టు చేయడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంద’ని దానికి క్యాప్షన్ ఇచ్చింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంటే తనకు ఎటువంటి భయం లేదని, పోలీసులు అరెస్ట్ చేయలేరని చెప్పకనే చెప్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి పోలీసులు కంగనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?