బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్ కొత్తేమి కాదు. చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. విభేదాలు వస్తే పెళ్లి కాకుండానే విడిపోతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులు అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల ఐ హీరోయిన్ అమీ జాక్సన్.. ప్రియుడితో బిడ్డను కని, ఆ తరువాత అతడికి బ్రేక్ చెప్పింది. ఇప్పుడు మరొక నటుడితో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ కూడా ప్రియురాలితో కలిసి ఒక బాబును కన్నాడు. కానీ పెళ్లి మాత్రం వద్దంటున్నాడు.
తన విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకున్న అర్జున్ రాంపాల్ తన భార్య మెహర్ జెసియాకు విడాకులిచ్చిన తర్వాత నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ తో కాళీ ఉంటున్న విషయం తెలిసిందే. 2019 లో ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు అరిన్ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే బాబు కూడా పుట్టింది పెళ్లితో ఇద్దరు ఒకటి అవ్వచ్చు కదా అంటే.. పెళ్లి మాత్రం వద్దు అంటున్నాడు అర్జున్. మా బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరంలేదని, మనసులు కలిసినరోజే మా వివాహం అయిపోయినట్లేనని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బార్యభర్తల కన్నా మేమేమి తక్కువ కాదని, ఇలా ఈ బంధాన్ని వివాహంతో ముడివేయడం తనకంటే గాబ్రియెల్లా కే ఇష్టంలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.