బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయాక నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ హోటల్స్, ఎయిర్ పోర్ట్స్ దగ్గర జంటగా కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలాయి. ఇక తాజాగా ఆదివారం సడెన్ గా హృతిక్ ఇంట్లో సబా ప్రత్యేక్షమయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆదివారం లంచ్ కి సబా ఆజాద్ తన తల్లిదండ్రులతో హాజరయ్యింది. ఈ విషయాన్ని హృతిక్ బంధువు రాజేష్ రోషన్ తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ‘ఆనందం ఎల్లప్పుడూ మన చుట్టే ఉంటుంది.. ముఖ్యంగా ఆదివారం, ప్రత్యేకంగా లంచ్ సమయంలో’ అంటూ రాసుకొచ్చాడు. ఇక దీనికి హృతిక్ సైతం .. మీరు కూడా చాలా సరదాగా గడిపారు .. నిజమే చాచా ఆనందం మన చుట్టూనే ఉండాలి” అని కామెంట్ పెట్టగా .. సబా కూడా ఉత్తమ ఆదివారం అంటూ కామెంట్స్ పెట్టింది. ఇక దీంతో వీరి రిలేషన్ అధికారికంగా తెలిపినట్లే అని అభిమానులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు హృతిక్, సబాల్లో ఏ ఒక్కరూ కూడా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరి ముందు ముందు ఏమైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.