పట్టువదలని విక్రమార్కులు ఎక్కడైనా కొందరుంటారు. పరాజయం పలకరించినా, అదరక బెదరక ప్రయత్నం మాత్రం వీడరు. నటుడు, నిర్మాత, కథకుడు అయిన జాన్ అబ్రహామ్ ను ఆ కోవలోని వాడే అని భావించవచ్చు. ఏప్రిల్ 1న జాన్ హీరోగా నటించి, కథ అందించిన ‘ఎటాక్ పార్ట్ 1’ మూవీ జనం ముందు నిలచింది. ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఓ మాటలో చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ముందుగానే…
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఎవరు ఎప్పుడు కలుస్తారు.. ఎవరు ఎప్పుడు విడిపోతున్నారు అనేది అస్సలు తెలియడం లేదు. ప్రేమ, పెళ్లి అని ఎన్నో కబుర్లు చెప్పిన జంటలు.. పెళ్లి తరువాత ఏడాది కూడా అవ్వకుండానే విడాకులు అంటున్నారు. ఇక మూడు, నాలుగేళ్లు డేటింగ్ లో ఉన్న తారలు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటారు అనుకోలోపు బ్రేకప్ అని చెప్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ పై పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సరసన, సిద్దార్థ్ మల్హోత్రా సరసన రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ ఉగాది పర్వదినాన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చాక్లెట్ బాయ్…
అజయ్ దేవగన్‌ను బాలీవుడ్లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు. నిర్మొహమాటంగా మనస్సులో ఏది అనిపిస్తే అది నేయడం ఆమె స్పెషల్. ఎదుట ఎవరు ఉన్నారు.. వారు ఎంత పెద్దవారు అనేది ఆమె అస్సలు చూడడు. తప్పు అని అనిపిస్తే ముఖం మీదే కడిగిపాడేస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహారు పై అమ్మడి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన షో కి వెళ్లి ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్…
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్చ్ షీట్ దాఖలు అయ్యింది. అతడు, అతని అసిస్టెంట్స్ కలిసి ఒక మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ ఆచార్య వద్ద పనిచేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్.. అతను తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆమె ఏం చెప్పిందంటే.. 2010లో అతడు తనతో…
బాలీవుడ్ హీరోయిన్ రిమి సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధూమ్ 2, గోల్మాల్, బాగ్బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ నటించి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. తాను స్నేహితుడని నమ్మిన ఒక వ్యక్తి తనను అడ్డంగా మోసం చేసాడని, కొత్త వ్యాపారం…