బాలీవుడ్ నటి పూజా మిశ్రా, నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై పై సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 5 షో తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రుఘ్న సిన్హా కుటుంబం 17 ఏళ్లుగా తనను వేధిస్తోందని చెప్పుకొచ్చింది. “బాలీవుడ్‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో నన్ను ఒక సెక్స్ వర్కర్ గా మార్చేశారు. నాపై చేతబడి చేయించి సెక్స్ రాకెట్ లో నన్ను ఇరిక్కించారు. శత్రుఘ్న సిన్హా, మా నాన్న చిన్ననాటి నుంచి స్నేహితులు. మా నాన్న అతనికి కోట్లలో డబ్బులు ఇచ్చారు. ఆ విశ్వాసం కూడా లేకుండా నన్ను వారు వాడుకున్నారు. శత్రుఘ్న సిన్హా, అతని భార్య పూనమ్ సిన్హా నన్ను కీలుబొమ్మలా మార్చి ఆడుకున్నారు.
వారికి అత్యాశ అనే దయ్యం పట్టింది. వారికన్నా ఎక్కడ నేను ఎదిగి ఎక్కువ పేరు తెచ్చుకుంటానో అని భయపడి , నా జీవితాన్ని నాశనం చేశారు. ఒకరోజు శత్రుఘ్ను సిన్హా పుట్టినరోజున విషెస్ చెప్పడానికి ఇంటికి వెళ్తే పూనమ్ నాకు చేతబడి చేసిన పదార్ధాలను తినిపించింది. ఆ తరువాత నా శరీరం నా కంట్రోల్లో లేదు. ఇలా ప్రతిసారి నాపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేశారు, నా కన్యత్వాన్ని అమ్మి ఫ్యాషన్ డిజైనర్ గానే ఉండిపోవాల్సిన తన కూతురు సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా చేశాడు.
ఇక పూనమ్ అయితే గొప్ప మహానటి. మా నాన్న దగ్గర బాలీవుడ్ ఇండస్ట్రీలో వేశ్యలు మాత్రమే పని చేస్తారని, అందుకే ఆ ఇండస్ట్రీలోకి తాను అడుగుపెట్టలేదని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు తన కూతురును ఎలా బాలీవుడ్ కు పంపింది..? వారివల్లనే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నా జీవితాన్ని నాశనం చేసిన కుటుంబం అది. నేను ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు అంటే దానికి కారణం శత్రుఘ్న సిన్హానే” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.