చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ అలియాస్ తర్సామీ సింగ్ సైనీ కన్నుమూశారు. గత కొంతకాలంగా హెర్నియా అనే వ్యాధి తో బాధపడుతున్న ఆయన ఇటీవలే చికిత్స కోసం యూకే వెళ్లారు. అయితే గతేడాది చివర్లో తాజ్ కరోనా బారిన పడ్డాడు. అయితే కరోనా కారణంగా హెర్నియా వ్యాధికి చేయాల్సిన సర్జరీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాధితోనే తాజ్ కోమాలోకి వెళ్లారని, రెండు రోజుల క్రితం కోమాలోకి బయటికి వచ్చిన ఆయన ఏప్రిల్ 29 న మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
90వ దశకం హిట్ సాంగ్స్కు పేరుగాంచిన పాప్ బ్యాండ్ స్టీరియో నేషన్‌కు ప్రధాన గాయకుడు. ప్యార్ హో గయా, నాచేంగే సారి రాత్, గల్లాన్ గోరియన్ వంటి 90వ దశకం హిట్ సాంగ్స్ తో సెన్సషణ సృష్టించిన గాయకుడు తాజ్.. బాలీవుడ్ లో అందరు ఆయనను ‘జానీ జీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక బాలీవుడ్ సూపర్ హిట్స్ ‘కోయి మిల్ గయా’తో పాటు ‘తుమ్ బిన్’ (2001), ‘రేస్’, ‘గెస్ట్ ఇన్ లండన్ (2017), ‘బాట్లా హౌస్’ (2019) సహా పలు చిత్రాల్లో పాటలు పాడాడు. జానీ జీ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.