రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు తమ సత్తా నిరూపించుకున్న తరువాతే…
తనకు తెలిసిన వారు ఆపదలో ఉంటే ఆపన్న హస్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండలవీరుడుగా పేరొందిన సల్మాన్ ఖాన్ బండల్లాంటి కండల వెనుక వెన్నపూసలాంటి మనసు ఉందని సన్నిహితులు చెబుతారు. బండబారిన హృదయమూ ఉందని, అందుకే ఒకప్పుడు తప్పతాగి కారు నడుపుతూ కొందరి ప్రాణాలూ హరించాడని గుర్తు చేస్తారు ఇంకొందరు. ఇక వన్యప్రాణులను వేటాడి కటకటాలూ లెక్కపెట్టిన సంగతినీ జ్ఞప్తికి తెస్తారు మరికొందరు. ఏది ఎలా ఉన్నా సల్మాన్ ఖాన్ కుటుంబం అసలు…
బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు.. ఎక్కడికి వెళ్లిన ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.. ఆయన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతాయి.. అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు కానీ, ఆ స్టార్ కొడుకు అప్పుడే కాదు ఇప్పటికి అవమానాలు ఎదుర్కొంటున్నా అని అతను చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అంటే బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ…
సాధారణ హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు 11 సినిమాలు చేయగా అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టాడు. ఇప్పుడు 12వ సినిమాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమానే ఆర్.ఆర్.ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ…
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం 1950లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను జెమినీ పతాకంపై ఎస్.ఎస్.వాసన్ హిందీలో ‘ఇన్సానియత్’గా రీమేక్ చేశారు. 1955లో విడుదలైన ఈ సినిమాలో ఏయన్నార్ పాత్రలో దిలీప్ కుమార్, యన్టీఆర్ పాత్రలో దేవానంద్ నటించారు. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి…
భారతదేశంలో స్టార్ హీరోస్ గా రాజ్యమేలిన వారిలో అత్యధిక కాలం జీవించిన నటునిగా దిలీప్ కుమార్ చరిత్ర సృష్టించారు. అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ స్టార్ హీరోగా రాజ్యమేలిన ఏ గ్రేట్ యాక్టర్ కూడా 98 సంవత్సరాలు జీవించలేదు. ఆ క్రెడిట్ దిలీప్ సాబ్ కే దక్కింది. ఈ యేడాది జూలై 7న దిలీప్ కుమార్ కన్నుమూశారు. డిసెంబర్ 11న దిలీప్ కు 99 ఏళ్ళు పూర్తయి, నూరవ ఏట అడుగుపెట్టి ఉండేవారు. అందువల్ల…
ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచారు హిందీ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా! అందుకే ఆయనను బాలీవుడ్ లో అభిమానంగా ‘షాట్ గన్ సిన్హా’ అనీ పిలుస్తుంటారు. ‘బీహారీ బాబు’గానూ ఆయనకు పేరుంది. శత్రుఘ్న సిన్హా తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ‘మేధావి’ అనే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘రక్తచరిత్ర’లోనూ శత్రుఘ్న సిన్హా అభినయించారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ శత్రుఘ్న సిన్హా రాణించారు. దేశ…
సెలబ్రిటీలు అన్నాకా నిత్యం అభిమానులు వారి చుట్టూనే తిరుగుతుంటారు.. ఇక వారు రోడ్లపై కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడతారు. ఆలా కుదరకపోతే సీక్రెట్ గానైనా తమ అభిమాన తారలను కెమెరాల్లో బంధిస్తారు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది తారలు ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే చిరాకుగా చూస్తారు. మరికొందరు తమ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఓపికగా వారికి ఫోటోలు ఇస్తారు. ఈ రెండు కాకుండా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ముంబైలో ఉదయం…
సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తాజగా ఆ కారణాన్ని టబు రివీల్ చేసింది. తాను సింగిల్ గా ఉండడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వలనే తాను ఇలా సింగిల్…