అభిమానుల ఫోన్ లాక్కొన్న స్టార్ హీరో.. నడిరోడ్డుపై అలా చేసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీలు అన్నాకా నిత్యం అభిమానులు వారి చుట్టూనే తిరుగుతుంటారు.. ఇక వారు రోడ్లపై కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడతారు. ఆలా కుదరకపోతే సీక్రెట్ గానైనా తమ అభిమాన తారలను కెమెరాల్లో బంధిస్తారు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది తారలు ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే చిరాకుగా చూస్తారు. మరికొందరు తమ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఓపికగా వారికి ఫోటోలు ఇస్తారు. ఈ రెండు కాకుండా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు.
ముంబైలో ఉదయం వాకింగ్ చేస్తున్న జాన్ అబ్రహంను బైక్ ఫై వెళ్లే ఇద్దరు యువకులు వీడియో తీశారు. జాన్ కి తెలియకుండా చేద్దామనుకున్నారు కానీ అప్పటికే జాన్ ఆ వీడియోను చూసాడు. వెంటనే వారివద్దకు వచ్చి ఫోన్ లాక్కున్నాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఫోన్ పగలకొడతాడేమో అనుకున్నారు.. కానీ, జాన్ అబ్రహం ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి తన అభిమానులతో ‘హయ్ హౌ ఆర్ యూ?’ అన్నాడు. ఆ తర్వాత ఆ సెల్ఫీ కెమెరాలో ‘హే, యూ గయ్స్ ఓకే? వీరు నా స్నేహితులు’ అన్నాడు. ఆపై ఆ ఫోన్‌ను వారికి ఇచ్చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన యువకులు జాన్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘హౌ హంబుల్ జాన్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం జాన్ అబ్రహం సత్యమేవ జయతే 2′ లో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!