సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తాజగా ఆ కారణాన్ని టబు రివీల్ చేసింది. తాను సింగిల్ గా ఉండడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వలనే తాను ఇలా సింగిల్ గా ఉండిపోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
” చిన్నతనం నుంచి అజయ్, నేను కలిసే పెరిగాం.. అజయ్ నా సోదరుని స్నేహితుడు. అతను నేను ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చేసేవాడు. నేను వేరే అబ్బాయిలతో మాట్లాడితే అస్సలు ఉరుకొనేవాడు కాదు..వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడేవాడు కాదని” తెలిపింది. అజయ్ వల్లనే నేను ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నాను.. దానికి ఇప్పుడు తను పశ్చాత్తాప్పడాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే వీరిద్దరూ కలిసి నాలుగైదు సినిమాల్లో నటించారు. కరోనా ముందు విడుదలైన ‘దేదే ప్యార్ దే’ చిత్రం మంచి హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.