చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి, ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు…
సోషల్ మీడియా బాగా విస్తరించింది. అపరిచిత వ్యక్తులు ఏవో మెసేజ్‌లు పంపుతూ వుంటారు. వాటికి స్పందించారంటే అంతే సంగతులు. మిమ్మల్ని చాలా తెలివిగా బుట్టలో వేసుకుంటారు దుండగులు. అనవసరమైన మెసేజ్‌లకు రిప్లై ఇస్తే, జేబులకు చిల్లుపడడం ఖాయం. హైదరాబాద్‌లో అనేక మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది కిలాడీ గ్యాంగ్. సెల్‌ఫోన్‌కు అవసరమైన మెసేజ్‌లతో పాటు అనవసరమైన మెసేజ్‌లు వస్తుంటాయి. ఒక నెంబర్ పంపించి… మీతో స్నేహం చేయాలని ఉందనో, లేక మీకు ఫోటోలు పంపించాం…
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆచూకీ భీమవరంలో లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్ధినిని కిడ్నాపర్ భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుంచాడని తేలింది. కిడ్నాపర్‌ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు భీమవరం మండలం కొత్త పూసలుమర్రుకి చెందిన ఫణీంద్ర. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని యువతిని నమ్మించాడు ఫణీంద్ర. ఆమెను భీమవరం బలుసుమూడి లో ఒక రూమ్ లో నిర్బంధించాడు.…
అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, వివాహితులు, విద్యార్ధినులకు వేధింపులు తప్పడంలేదు. తమ కోరిక తీర్చాలంటూ నానా యాగీ చేస్తున్నారు. అనంతపురంలో ఓ గిరిజన యువతిని వేధిస్తున్నాడో యువకుడు. తన కోరిక తీర్చాలని లేకుంటే… ఆ అమ్మాయితో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కట్టుకున్న భర్తకు లేనిపోని మాటలు చెప్పి అమె భర్తను కాకుండా చేసి నేడు విడాకులు కావాలంటూ భర్త తరపు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. తనకు తన కుటుంబానికి న్యాయం…
ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీశాడో ప్రబుద్ధుడు. ఆమె నీలి చిత్రాలు తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. వారి వికృత చేష్టలకు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు…