తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు అని చెప్పుకొచ్చారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్లుండి సమీర్‌పేటలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. అసెంబ్లీ విస్తారకులు, తెలంగాణ ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ నిందితులు దొరికిపోయిన కేసులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ కేసులో, ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.. దేశంలోని అన్ని కోర్టులకు, వ్యవస్థలకు, పార్టీలకు, ప్రముఖులకు సైతం.. ఆ వివరాలను పంపించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోవైపు.. ఈ కేసును పూర్తిస్థాయిలో తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేశారు.. హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్…