BL Santosh Visit Hyderabad: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్లుండి సమీర్‌పేటలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. అసెంబ్లీ విస్తారకులు, తెలంగాణ ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ బూత్ కమిటీల నియామకం, మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
Read also: Astrology: డిసెంబర్ 27, మంగళవారం దినఫలాలు
కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఎల్ సంతోష్ తొలిసారిగా హైదరాబాద్ కు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఎల్ సంతోష్ వస్తోంది మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు చేసే విషయంలో కాదు.. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు బీఎల్ సంతోష్ వస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. 29న జరిగే సమావేశంలో అసెంబ్లీ ఇంచార్జిలు, కన్వీనర్లు, విస్తారకులు, పాలకులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీఆర్‌పీసీ 41 కింద సీఆర్‌పీసీ 41 కింద బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా ఆయన విచారణకు రాలేదు. బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు, కార్యవర్గ సమావేశాలకు కూడా బీఎల్ సంతోష్ రాలేదు. అదే సమయంలో గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నందున.. అధికారికంగా ఆయా పనుల్లో బిజీబిజీగా ఉండడం వల్లే కార్యక్రమాలకు హాజరుకాలేదని నేతలు తెలిపారు. సిట్ నోటీసులపై బీఎల్ సంతోష్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు స్టే విధించింది.
Read also: Ben Stokes: ఐసీసీపై బెన్ స్టోక్స్ ఆరోపణలు.. షెడ్యూల్‌పై శ్రద్ధ ఏదీ..?
ఈ కేసులో బీఎల్ సంతోష్ పాత్ర ఉందని అనుమానిస్తున్న అధికారులు.. విచారణకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించినా.. కోర్టు స్టేను పొడిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సంతోష్ హైదరాబాద్ వస్తున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అందుకు బీజేపీ వేసిన ప్లాన్ రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తికరంగా మారింది.
Read also: Rohingya Refugees: నెల రోజులు నడి సముద్రంలోనే.. చివరికి గాలులతో..