MLA’s Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరొకరికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో మరొకరికి నోటీసులు జారీ చేసింది సిట్. జగ్గు స్వామి సోదరుడు మనిలాల్‌కి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును మనిలాల్ ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. కేసుపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నిందితులతో పాటు బీజేపీ వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.
Also Read : CM YS Jagan: రేపు విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
బండి సంజయ్ పేరు చెబితే నిమిషాల్లో విచారణ ముగిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్‌పై నమ్మకం లేదని.. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు శ్రీనివాస్ తరఫు న్యాయవాది. ఈ కేసులో ప్రతిపాద నిందితులుగా ఉన్న బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు జారీ చేసిన 41ఏ నోటీసులపై ఉన్న స్టేను 22వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. 41ఏ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేయడంతో వాటిపై స్టే విధించింది హైకోర్టు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..