టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పదేపదే తన పేరు ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు.. పదేపదే ఈటల నా పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్న హరీస్.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.. ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన.. రాజేందర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతుండటంతో బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం సీఎం కేసీఆర్ కు నష్టమేనని అన్నారు. తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్తపడాలని నారాయణ సూచించారు. అలాగే ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి కూడా…
మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్ళటం టిఆర్ఎస్ కే నష్టమని.. టిఆర్ఎస్ లో అసలైన తెలంగాణ వాదులు ఆరుగురే ఉన్నారని పేర్కొన్నారు. ఈటెల బిజెపిలోకి వెళ్తే కేసీఆర్ కే నష్టమని.. మరో పశ్చిమ బెంగాల్ లా… తెలంగాణ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడాలని సూచించారు. జార్ఖండ్ సీఎం.. కేంద్రాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తే … సీఎం జగన్ ఎందుకు అడ్డు చెప్పారని..ఇప్పుడు ఎందుకు కేంద్రానికి…
తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్తో బంధానికి స్వస్తి పలికారు. కాగా నేడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉండగా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు…
ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ సభ్యత్వానికి శాసనసభకు రాజీనామా చేయడంతో తెలంగాణలో గత పక్షం రోజులుగా సాగుతున్న రాజకీయ చర్చలో ఘట్టం ముగిసింది, ఢల్లీిలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా తదితరులను రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్ సహా కలసి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆ పార్టీలో చేరతారా లేదా అన్న మీమాంస అర్థం లేనిది. ఈ నెల తొమ్మిదవ తేదీన అంతకు ముందురోజో ఆయన చేరతారని బిజెపి ముఖ్యనేతలే చెబుతున్నారు. టిఆర్ఎస్లో తిరుగుబాటు తీసుకొచ్చి అసమ్మతివాదులను…
పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల భట్టితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..లెఫ్ట్ భావజాలాలు ఉండి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడో తెలియదని చురకలు అంటించారు. కేంద్ర రక్షణ కోసం ఈటల బీజేపీ వైపు వెళ్ళారని..ఎవరు అధికారంలో ఉంటే అటు పోవడం నాయకులకు అలవాటు అయ్యిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని.. సాగర్ లో ఎన్ని ఓట్లు వచ్చాయని నిలదీశారు. తెలంగాణలో ఇంత గలిజు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని..ఇలాంటి…
ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల…
వచ్చే వారమే బీజేపీలో చేరుతానని ఈటల పేర్కొన్నారు. నేను వామపక్ష, లౌకిక వాదిని… కానీ పరిస్థితులు తనను బిజేపి వైపునకు తీసుకెళ్ళాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ? రాష్ట్రంలో సీపీఐ పార్టీ పోటీలో ఉండాలా లేదా అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ? అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు టిఆర్ఎస్ ప్రయతించిందని… ఇప్పటికే హుజురాబాద్ నియోజవర్గంలో టిఆర్ఎస్ 50 కోట్లు…
ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లోనూ బిజేపిలో చేరుతున్నట్లు ఈటల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈటల ఎప్పుడు బిజేపిలో చేరుతారనే దానికిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 11 తర్వాత బీజేపీలో ఈటల చేరనున్నారని తాజాగా సమాచారం అందుతోంది. అంతలోపే స్పీకర్ కు రాజీనామాను మెయిల్ చేయనున్నారు ఈటల. ఈటల చేరికపై ఇప్పటికే హుజురాబాద్ బీజేపీ నేతలతో మాట్లాడారు బండి…