తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి అఫిషియల్‌గా రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించనున్నాడు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రమే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.…
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…
తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.. ఇక, పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణపై కూడా దృష్టి పెట్టబోతున్నాం అని తెఇపారు ఆ పార్టీ నేత శివ ప్రకాష్… హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లలో పార్టీని బలోపేతం చేయాలి.. రాష్ట్ర నాయకులతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతా… మీ మనసులో మాట అప్పుడు చెప్పండి అని…
తెలంగాణ సిఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో యుద్ధం నడుస్తుందని.. అది ఆత్మగౌరవనికి, అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తుందన్నారు. ఈటల బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడిపోవడమని విమర్శలు చేశారు. ఒక్క వ్యక్తి, అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటల గొంతు వినిపించారన్నారు. ఇన్నాళ్లు ఈటల trsలో సంఘర్షణ పడ్డారని…తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారని తెలిపారు. కెసిఆర్ కు ఆయన…
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసిన బెంగాల్ లో మమతా బెనర్జీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే ఆ ఎన్నికల ముందు.. టీఎంసీ కీలక నేతలను లాగేసుకున్న బీజేపీ.. మమతా బెనర్జీని ఒంటరి చేసింది. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఒంటిచేత్తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చింది మమతాబెనర్జీ. అయితే ఆమె విజయం తర్వాత బెంగాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈనెల 14 వ తేదీన ఈటల ఢిల్లీవెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటుగా మరికొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగానే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేవరయాంజల్ లో భూములను ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు…
కాంగ్రెస్ అధిష్ఠానంపై వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత అన్నారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు విశ్వాసమున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌లోని కీలక నేత జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద మిగిలిన అన్నింటికన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం…
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనే కాదు తన శవం కూడా భారతీయ జనతా పార్టీలో చేరదన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద తాజాగా బీజేపీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద నిర్ణయం వ్యక్తిగతం అంటూనే.. ఇన్నేళ్లు వ్యతిరేకించిన పార్టీలో ఎలా చేరతారంటూ ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై లేఖ రాసిన నేతల్లో కపిల్ సిబల్ కూడా ఒకరు.. అలాంటి…
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ లో కాస్త…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం…