మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా?ఈటల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటల బీజేపీలో చేరారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటెల రాజేందర్ ఎలా చేరాడు? బీజేపీలో ఈటలకు సముచిత గౌరవం దక్కేలా లేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతాడని అనుకున్నాం..కానీ అది జరగలేదని.. రాచరికపు, ఫ్యూడల్ కు ఉండాలిసిన భావాలు, ఆస్తులు ఈటల రాజేందర్ వద్ద ఉన్నాయని ఫైర్ అయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించేవారు కావచ్చు కానీ బీజేపీలో చేరడంతో ఆయన పైన నమ్మకం పోయిందని విమర్శలు చేశారు. పోరాటం చేయకుండా పారిపోయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారని..బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అన్నారు. తెలంగాణ కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అని… కేసీఆర్ ని మాత్రనే బలపర్చాలని పేర్కొన్నారు..