భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఇవాళ మర్యాదపూర్వకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిశారు. బిజెపి, తెలంగాణ ప్రజల తరఫున ఎన్వీ రమణకు ఈ సందర్బంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు కె.లక్ష్మణ్. ఆనంతరం కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో తెలుగు వ్యక్తి అధిరోహించడం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలంగాణ హైకోర్టులో 42 మంది జడ్జీలు ఇవ్వడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఎన్వీ రమణ.. 24 నుండి 42 మంది జడ్జీలను నియమించడం చాలా గొప్ప నిర్ణయం అని తెలిపారు.