భారతీయ జనా పార్టీకి చెందిన మహిళా ఎంపీ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లు, రాడ్లతో విరిచుకుపడ్డారు.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ఆమె.. సొమ్మసిల్లిపడిపోయారు.. ఈ ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్ ఎంపీ రంజీతా కోలీ.. త రాత్రి ధర్సోనీ గ్రామంలో ఓ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు.. తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో భరత్పూర్ జిల్లాలోని ధర్నోనీకి వెళ్తుండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, ఐరన్…
తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ,…
ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో వస్తే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎలా బీజేపీలోకి ఆహ్వానిస్తారని నిలదీశారు పెద్దిరెడ్డి. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని..ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమన్నారు.ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు… నాకు…
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు……
ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు. ఆయన నేను కలిసి 15 ఏళ్ళు కలిసి పనిచేసాం… ఇప్పుడు కలిస్తే తప్పేంటి అని అన్నారు. మేము కలిసినంత మాత్రానా పార్టీ లో చేరేందుకు అనుకోలేము. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని నాతో చెప్పాడు…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను విజిట్ చేసి.. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందారని ఎద్దేవా చేశారు. ఎద్దు ఎడిసిన వ్యవసాయం…రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని కెసిఆర్ అన్నారని..మరి ఇప్పుడు తెలంగాణ రైతు ఎడుస్తున్నారు…ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతుబంధు ఎక్కడికి…
సీఎం జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోలేదు అని బీజేపీ లీడర్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ 35వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను…
సిద్దిపేట అభివృద్ధిపై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సిద్దిపేట లో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా.? అని ప్రశ్నించిన ఆమె.. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు.. కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్ వేసుకుని ఆస్పత్రిలోకి వెళ్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? రోజు లాక్ డౌన్…
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బిజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉందని..ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విష్ణు వర్ధన్ రెడ్డిమండిపడ్డారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని..చేతల్లో చర్యలు లేవన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో ఎక్కడైనా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు ఏ ఒక్కరైనా ఆధారాలతో నిరూపించగలరా? రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు.. కనీసం 10…
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు.. అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది…