ఏపీలో వినిపించని జనసేనాని మాట.. సినిమాలతో బిజీనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ రోడ్డెక్కుతోంది. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటిస్తోంది. అయితే జనసేనాని మాట ఎక్కడా వినిపించడం లేదు. కీలక పరిణామాలపై ప్రకటనల ద్వారా స్పందించే పవన్ కల్యాణ్.. ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టేశారు. ఇంతకీ సేనాని మౌనానికి కారణం ఏంటి? సినిమాలతో బిజీగా ఉన్నారా… కోవిడ్‌తో రాజీ పడ్డారా?
ఏపీలో పెరిగిన బీజేపీ కార్యక్రమాలు
Also Read
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు తగ్గింది. ఇదే సమయంలో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేపడుతోంది. గతంతో పోల్చితే ప్రభుత్వ తీరును ప్రశ్నించడంలో కమలనాథుల స్వరంలో మార్పు కనిపిస్తోంది. కోవిడ్ కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు జిల్లా పర్యటనలు, పార్టీ కార్యక్రమాలతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజల్లో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు పెంచారు. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ట్వీట్స్.. స్టేట్‌మెంట్స్ కూడా లేవు.
ఏపీ వ్యవహారాలపై పవన్ స్పందన లేదు!
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే అంశంలో పవన్ స్పష్టమైన వైఖరి వెల్లడిస్తారని అనుకున్నా.. ఆయన స్పందన ఆ స్థాయిలో లేదన్నది స్థానికంగా వినిపించే టాక్. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగినా.. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తరువాత జనసేనాని కోవిడ్ బారినపడి.. కొద్దిరోజుల్లో కోలుకున్నారు. ఆపై ఏపీలో వ్యవహారాలపై ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరో ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ అడపాదడపా స్పందించినా.. వాటికి జనసేన లుక్ రాలేదు. జనసేన అంటే పవన్ ఒక్కరే అనే భావన గట్టిగా ఉండడంతో ఇతర నేతలు ఏదైనా చేసినా.. ఏమైనా మాట్లాడినా కేడర్‌కు, జనాలకు కనెక్ట్ కావడం లేదు.
బీజేపీతోపాటు జనసేన రోడ్డెక్కిన సందర్భాలు లేవు!
మిత్రపక్షాల ఆందోళన అని బీజేపీ ప్రకటనలు ఇస్తున్నా.. ఇరు పార్టీలు కలిసి రోడ్డెక్కిన సందర్భాలు పెద్దగా లేవు. రాష్ట్రంలో కొంతకాలంగా చర్చలో ఉన్న అంశాలపై పవన్ స్పందన లేదు. వకీల్‌సాబ్ అడిగాడని చెప్పండి అని గుడివాడలో డైలాగులు పేల్చిన జనసేనాని ఆ తరువాత రాజకీయ, పాలనా అంశాలపై మాట్లాడింది లేదు. పవన్ ఎటువంటి పిలుపు ఇవ్వకపోయినా.. పంచాయతీ ఎన్నికల్లో జనసేన క్యాడర్ గ్రామస్థాయిలో గట్టిగా పనిచేసింది. సత్తా చాటి కొన్నిచోట్ల ఉనికి చాటుకున్నారు. పార్టీపరంగా ఎటువంటి ప్రోత్సాహం లేకున్నా గ్రామాల్లో ఉన్న వారే నాయకత్వం వహించి జెండా ఎగురవేసే ప్రయత్నం చేశారు.
కేడర్ ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలకు గ్యాప్!
ఏపీలో రాజకీయ కార్యక్రమాలకు పవన్ చొరవ తీసుకోకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు సినిమాలు.. ఆ తరువాత వచ్చిన కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగానే పర్యటనలు, ప్రకటనలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాల టాక్. స్వయంగా ఆయన కూడా కరోనా బారిన పడడంతో క్యాడర్‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు విరామం ఇచ్చారన్నది జనసేన వర్గాలు చెప్పేమాట. సినిమా షూటింగ్‌లు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని వ్యవహారాలను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నారని.. ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు.
కేడర్‌కు మింగుడు పడని బీజేపీ, జనసేనలు?
ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేనలు ఒక్కొక్కరు ఒక్కోలా పనిచేయడం రెండు వర్గాలకు మింగుడు పడటం లేదు. బలమైన పక్షాన్ని ఢీకొట్టాలంటే కలిసి పనిచేయాలి. దీంతో ఈ పరిస్థితి తాము ఊహించిందే అని కొందరు కమలనాథులు చెబుతుండగా.. ఇది కొన్నాళ్లే అని జనసేన వర్గాలు వివరిస్తున్నాయి. సినిమా షూటింగ్‌లు, కోవిడ్ కారణాలైనా.. పవన్ స్వరం వినిపించకపోవడం జనసేనతోపాటు మిత్రపక్షానికి లోటుగానే ఉందట.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!