తెలంగాణ రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం నడుస్తోందని..కిసాన్ మోర్చా ఇన్చార్జ్ ప్రేమేంధర్ రెడ్డి అన్నారు. ఏడేళ్ళలో ఎన్నికోట్ల నకిలీ విత్తనాలు అమ్మారు.. రైతులు ఎంతమేర నష్టపోయారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఎన్ని పీడీ యాక్ట్ పెట్టారు.. రైతుబందు పేరుతో రైతులకు వచ్చే అనేక సబ్సిడీలను తెలంగాణ సర్కార్ కోత పెట్టిందన్నారు. డీఏపీ కేంద్ర ప్రభుత్వం సగం ధరకే ఇస్తుందనన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తా అన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకుంటరా? లేదా..? రైతులకు అరచేతిలో…
కరోనా సమయంలో కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మరోవైపు.. నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ…
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి.. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎన్నో పరిణామాలు, మరెన్నో ట్విస్ట్ ల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు యెడియూరప్ప.. అయితే, ఈ మధ్య.. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు.. జాతీయ నాయకత్వం కూడా యెడియూరప్పను సీఎం చైర్ నుంచి దించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.. అయితే, అలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు నేతలు. మరోవైపు.. యెడియూరప్ప సర్కార్ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం…
టిడిపి, బిజేపిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశారా అనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని… ఈ సీజనుకు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు వాటిని రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకుని క్రెడిట్ తీసుకోవచ్చని.. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను మేము అనుసరిస్తున్నామని…
ఈటల ఎపిసోడ్ తర్వాత టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? మాజీ మంత్రికి సన్నిహితులైన ప్రజాప్రతినిధులవైపు అందరి చూపు పడిందా? ప్రస్తుత పరిణామాలపై మౌనంగా ఉండేందుకే సన్నిహితులు మొగ్గుచూపుతున్నారా? మరికొద్ది రోజులు అలా ఉండటమే బెటర్ అని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నాయకులు? టీఆర్ఎస్లోని ఈటల సన్నిహితుల దశ దిశ ఏంటి? తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనుచరులతో డిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. గులాబీ…
ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పత్రికలు, పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కోరుతున్నానని.. ఏ ఒక్కరికీ భారం పడకూడదని, ఇబ్బంది పడకూడదనే సంస్కరణలు తెస్తున్నామని స్పష్టం చేసారు. భాజపా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు..మీరు మాకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. భాజపా నేతలు వచ్చి మాకు సుద్దులు చెప్పడం తప్పు అని ఫైర్ అయ్యారు. పన్ను విధింపులో ఇప్పటివరకు ఉన్న లోపభూయిష్ట విధానం ఉండగా…
ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ మారినప్పటి నుంచి.. ఈటలపై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి జరగలేదని… తాను చేసిన అభివృద్ధి కనబడుతుందని తెలిపారు. ఎన్నికలు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.…
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని…
టీఆర్ఎస్ను వీడి.. బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు.. అవమానం జరిగిందా? దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జోరందుకుందా? ఇంతకీ ఢిల్లీలో ఈటలకు ఎదురైన అనుభవాలేంటి? సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దృశ్యాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్.. బీజేపీలో ఈటల చేరికపై ఓ రేంజ్లో ట్రోలింగ్ కొద్దిరోజలుగా తెలంగాణ రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చకచకా జరిగిపోయాయి. వివిధ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో ఈటల రాజేందర్ చేరారు. బీజేపీలో రాజేందర్ చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆరేండ్ల క్రితమే ఈటెల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు. బీజేపీలో చేరినందుకు రాజేందర్ ప్రజలకు…