హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికలు ప్రజలు కోరుకుంటే వచ్చినవి కావు. సోనియాగాంధీ నిర్ణయించిన అభ్యర్థి వెంకట్ ను హుజూరాబాద్ లో పెట్టారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావ్ కు సవాల్, పేదలకు డబుల్ బెడ్ రూం లు ఇస్తాం అన్నారు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూం ఇచ్చారో చెప్పండి.. ఇవ్వని గ్రామాలకు వెళ్దాం.. అక్కడ మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం ఉండదు కావాలంటే చూపించండి.. లేకుంటే మేము కాంగ్రెస్ తరపున పోటీ చేయం ఓట్లు అడగం. ఢిల్లీలో మోడీ కేసీఆర్ ఒకటే అని తెలిపారు.
హుజూరాబాద్ లో మాత్రం హరీష్ రావ్ ఈటెల కొట్లాడుకుంటారు. మోడీ కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే . 35 రూపాయల లీటర్ పెట్రోల్ ను ఇద్దరూ పన్నుల ద్వారా 110 రూపాయలు వసూలు చేసి దోపిడీ చేయడం లేదా… ఎవరిని నమ్మిస్తారు.. ఇక్కడి యువతను పిచ్చోల్లు అనుకుంటున్నారా అన్నారు. గోర్లు బర్లు చేపలు కల్లు అమ్ముకోవడం అందుకోసమే నా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది.
మే 7న వేం నరేందర్ రెడ్డి కొడుకు పెళ్లిలో ఈటల రాజేందర్ నన్ను కలిశారు. మేము చీకట్లలో కలవలేదు. కేటీఆర్ గోల్కొండ రిసార్ట్ లో బాజాప్తా కలిశాం పెళ్లిలో అందరి ముందే. కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది కేసీఆర్, కేటీఆర్ కాదా అన్నారు. మీకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ కాదా. ఐఏఎస్ ల కమిటీ రిపోర్ట్ ఏదీ ఈటెల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. బీజేపీ లో ఈటల చేరాకా ఈటెల పై కేసులు ఎందుకు పెట్టలేదు. అమిత్ షా ఆధ్వర్యంలో మీ నాన్న కేసీఆర్ మధ్య ఒప్పందం జరిగే ఈటలపై కేసులు పెట్టలేదు. అమిత్ షా మోడీ లు గాడ్సే లు. ఇంటికొక ఓటు వేయండి.. మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్ ను తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తుంది అని పేర్కొన్నారు.