బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 27వ రోజుకు చేరుకుంది.. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఇతర ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు బండి.. ఇక, ఇవాళ్టితో కామారెడ్డి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.. మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల గంభీరావు పేట మండలంలోకి అడుగుపెట్టనున్నారు.. నేటి నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజుల పాటు కొనసాగనుంది ప్రజా సంగ్రామ యాత్ర.. సిరిసిల్ల జిల్లాలో ఐదు రోజులపాటు 72 కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగనుంది. ఇక, ఇవాళ సాయంత్రం గంభీరావుపేట మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.