హుజూరాబాద్లో గెలవటం ఎలా? ఏం చేస్తే గెలుస్తాం? ఒకటి డబ్బు ..రెండు హామీలు. కుల సమీకరణలు ఎలాగూ ఉంటాయి. కానీ వాటికి కూడా ఈ రెండే అవసరం. అధికార పార్టీ ఈరెండింటినే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. జోరుగా హామీల వర్షం కురిపిస్తోంది. గులాబీ పార్టీ వారు ఓటుకు పది వేలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కూడా బాగానే ముట్టచెపుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన బై…
ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. పాలక, ప్రతిక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. నువ్వా నేనా అనే పరిస్థితి హుజురాబాద్లో కనిపిస్తోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది ఎన్నికల కమిషన్.. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే…
పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. 2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా? బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి.…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టినెలకొంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉపఎన్నిక మారిపోవడంతో ఫలితం ఎలా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నేతలంతా నువ్వా.. నేనా? అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇదే అదనుగా ఎన్నికల అధికారులు సైతం దూకుడుగా వెళుతున్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 13రోజుల్లోనే ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులపై 40కిపైగా కేసులు నమోదు చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ కేసుల…
ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారని అనుమానం వచ్చిందా? వస్తాం అనగానే వచ్చేయ్యండని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? ఇంట్లోనే కట్టేసుకోవాలని చూస్తోందా? బీజేపీతో ముగ్గురు ఎంపీలు అంటీముట్టనట్టు ఉంటున్నారా? సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే టీడీపీలో ఓ వెలుగు వెలిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టి.జి. వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకుందో… లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ……
సీఎం కేసీఆర్ వదిలిన బీసీ బాణం.. బీజేపీని ఇరుకున పడేసిందా? బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచారా? ఈ అంశం హుజురాబాద్లో అధికారపార్టీకి కలిసి వస్తుందా? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? దేశ రాజకీయాలలో బీసీ కుల గణనకు డిమాండ్స్..! బీసీ కుల గణన ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ కూడా ఇదే. వెనకబడిన వర్గాలకు చెందిన పలు సంఘాలు కూడా ఇదే శ్రుతి…
త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరుపార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కాంగ్రెస్ కు కొత్త దారిని చూపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలో నయా…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు…
హుజురాబాద్కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది. హరీష్రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్లో బీజేపీ నాయకులు ప్రచారం…