రేపు హుజురాబాద్ కు రేవంత్.. సర్వత్రా ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రేపు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించారు.
రేవంత్ పీసీసీగా నియామకమైన తరువాత వచ్చిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఉప ఎన్నిక ప్రత్యేకతను సంచరించుకుంది. ఎన్నికల కోడ్ వచ్చిననాటి నుంచి హుజురాబాద్ లో రేవంత్ ప్రచారం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో రేవంత రెడ్డి రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం కరీంనగర్ నుంచి 3 గంటలకు వీణవంక చేరుకోనున్న రేవంత్ వీణవంక బస్టాండ్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వీణవంక నుంచి జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఇల్లందకుంటలో శ్రీరాములపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి కమలాపూర్ చేరుకొని బస్టాండ్ సమీపంలో ప్రచారం నిర్వహించనున్నారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!