టీఆర్ఎస్ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ…
ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి.. కానీ, ఆయన్ను కూడా మోసం చేశారు రంటూ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్… కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు లాంటి వాడు.. ఆయన్ను కూడా మోసం చేసింది కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు.. కేసీఆర్ అయన…
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి జాతీయ కార్యవర్గం లో కొత్త వారికి చోటు దక్కింది. అంతేకాదు తెలంగాణ నుండి ఎక్కువ మంది కి అవకాశం దక్కింది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏకంగా నలుగురికి చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఇద్దరికి అవకాశం దక్కింది. కార్యవర్గ సభ్యులు గా కిషన్ రెడ్డి, గరిక పాటి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట…
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా అభ్యర్థిని కూడా ప్రకటించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరులో నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో మరోసారి సురేష్‌ను ఉప ఎన్నికల్లో అభ్యర్ధిగా బీజేపీ ఎంపికచేసింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్నికల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ…
కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అయితే, గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కడప జిల్లా నేతలతో చర్చలు ఏపీ బీజేపీ చర్చలు నిర్వహించారు.…
హుజురాబాద్‌లో పార్టీలు కులాలు.. బలాల లెక్కలు తీస్తున్నాయా? గత ఎన్నికలకు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉండటంతో.. వివిధ సామాజికవర్గాల వైఖరి అంతుచిక్కడం లేదా? ఏ వర్గం ఎటు.. పార్టీలకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఉపఎన్నికలో కాంగ్రెస్ బలం చాటగలదా? 2018లో జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇప్పుడు జరగబోతున్న ఉపఎన్నికకు అస్సలు పోలిక లేదు. నియోజకవర్గ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది పోరాటం. అప్పట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్…
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరుఫున వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనమే అయినా పోటీ మాత్రం తప్పదని తెలుస్తోంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని బీజేపీ, కాంగ్రెస్ లు…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను ఈటల రాజేందర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక్కడ మరోసారి గెలిచి సత్తాచాటాలని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే కమ్యూనిస్టు భావాలు కలిగిన ఈటల రాజేందర్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు…
ఏపీలో కొత్త పొత్తులకు బీజం పడిందా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే వెళ్తున్నాయా? బద్వేలు ఉపఎన్నికలో పోటీ విషయమై మిత్రులు భిన్నదారులు వెతుక్కుంటే.. వేర్వేరు దారుల్లో ఉన్నవారు ఏకతాటిపైకి వస్తున్నారా? బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా? ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రిప్లబిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత పొలిటికల్ కలర్స్ ఎటెటో వెళ్తున్నాయి. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ క్రమంలో బూతులు..…
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం…