పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి… వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రైతులు పండిస్తున్న వరి పంటను ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ వరి వద్దంటున్నాడు… ఇక్కడ కేసీఆర్ అదే చెపుతున్నాడని ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ లో కేసీఆర్.. మోడీని కలిసి వచ్చిన తరువాత ఇంత వరకు ఏ కేంద్ర మంత్రి దగ్గర అపాటిమెంట్ తీసుకోలేదని మండిపడ్డారు.…
సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడని నిజామాబాద్ లోక్ సభ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శలు చేశారు. తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని.. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడు? అని నిలదీశారు. గత మార్చి 14 నుండి భైంసాలో హిందువులపై ఎంఐఎం పార్టీ దాడులు జరిపారని… నలుగురు హిందూ వ్యక్తులను చంచల్…
తమిళ నాడు రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం.. హెలికాప్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో.. ఏకంగా.. బిపిన్ రావత్ దంపతులతో సహా.. 13 మంది మరణించారు. దీంతో దేశం విషాద ఛాయలోకి వెళ్లింది. అయితే.. తాజాగా హెలికాప్టర్ సంఘటనపై వివాదస్పద రాజ్య సభ సభ్యులు సుబ్ర మణ్య స్వామి ఆస్తకి కర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ”తమిళ నాడులోని కూనూర్ సమీపంలో జరిగిన…
సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది చనిపోవడం యావత్ దేశాన్ని బాధలోకి నెట్టివేసింది. ఏ మట్టి కోసం పరితపించాడో.. అదే మట్టిలో మరణించాడు బిపిన్ రావత్. ఈరోజు తమిళనాడు నుంచి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పార్థీవ దేహాలు ఢీల్లీకి తరలించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమిత్ షాతో నేడు…
సింగరేణిలో సుదీర్ఘకాలం తరువాత సమ్మె సైరన్ మోగింది.నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. మరో 11 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.18 ఏళ్ల తర్వాత అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా…
తెలంగాణలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించే విషయంలో బీజేపీ ప్లాన్ మారిందా? ఇందుకోసం ఇద్దరు నాయకులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారా? బీజేపీని వీడి వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి తీసుకొస్తారా? కాషాయ శిబిరం వ్యూహం ఏంటి? రెండో దశ చేరికలకు బీజేపీ తలుపులు తెరిచిందా? బీజేపీలో చేరికలపై తెలంగాణలో మళ్లీ చర్చ మొదలైంది. అప్పట్లో కీలక నాయకులతో వరసగా మంతనాలు సాగించి.. కొందరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కమలనాథులు. మధ్యలో ఈ ప్రక్రియకు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు…
ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్‌ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం వైఎస్ జగన్.. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా.. ఓటీఎస్ పథకం పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం.. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.. రూ.10వేల కోట్ల రూపాయల…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని…
ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రంలో బీజేపీ ఓట్లు అడిగే హక్కు లేదు అని చలసాని శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి హోదా ముగిసిన చాప్టర్ అని ఎలా అంటారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిలదీయలేదు అని ప్రశ్నించారు. విభజన హామీల గురించి ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు ఎంత.. ఏపీకి ఎంత ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో…
తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…