నిజామాబాద్ జిల్లాలోని భీంగల్లో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మునిసిపాలిటీగా మారి అభివృద్ధిపథంలో నడుస్తోందని ఆయన అన్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు…
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్ఎస్కో, కేసీఆర్కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం…
తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం…
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు…
ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే కాదు.. తనకు నచ్చిన టీమ్, తాను మెచ్చిన విధంగా పనిచేసే టీమ్ ఉండాలని అందరు సీఎంలు కోరుకుంటారు.. ఇక, జాతీయ పార్టీలు అయితే.. వివిధ సమీకరణలు చూసుకుని మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన చేపడుతుంటింది.. ఇక, నాలుగు నెలల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. బీజేపీ హైకమాండ్ ఆదేశాలను మంత్రి వర్గ విస్తరణపై దృష్టిసారించారు.. తన కేబినెట్లో ప్రస్తుతం ఉన్న సుమారు 10 మంది పనితీరు బాగాలేదని…
ఉద్యోగ సంఘాల నేతలుగా ఓ వెలుగు వెలిగి.. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి.. ఇప్పుడు ఎందుకు కారు దిగి వెళ్లిపోతున్నారు? బీజేపీవైపు అడుగులు వేయడం వెనక వారి ఆలోచనలేంటి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీలో ఉద్యోగ సంఘాలది కీలక పాత్ర. పలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో రావడంతో.. ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టి…
లీడర్స్ ఫర్ సేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడు పోయారనే ఆరోపణలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఎవరు బాగోతం ఏంటో తెలుసుకునేందుకు.. ఏకంగా లై డిటెక్టర్ పరీక్షలకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్..! ఎన్నికలంటేనే.. బోల్డంత డబ్బు ఖర్చుపెట్టాలి. ఓటర్లకు పంచడం ఎలా ఉన్నా.. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు నోట్ల కట్టలతో కొడతారు. దీపం…
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేవారు.. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ఆయన.. ఈ సందర్భంగా రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నేను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్న ఆయన.. 2014లో బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి రాజమండ్రి టికెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. మంత్రి పదవి ఇస్తానన్నా నేను వద్దనానని చెప్పుకొచ్చారు.. ఇక, 2024 తర్వాత నేను రాజకీయాల్లో ఉండబోను అంటూ…
జగన్ సర్కార్ పై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని నిలదీశారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చామని… మరో…