సమంత నటించిన పుష్ప ఐటెం సాంగ్ పై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పాటపై వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్… తాజాగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. డివోషనల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్ తరహా లో రాయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని లేఖ లో పేర్కొన్నారు రాజసింగ్. దేవి శ్రీ ప్రసాద్ వ్యహారాల శైలితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను కోరారు రాజాసింగ్. అయితే.. దీనిపై చిత్ర బృందం, దేవీ ప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.
