తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ల మధ్య తెరుస్తారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.…
విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సీఎం జగన్ గతంలోనే చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్…
యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్‌వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక,…
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేత విష్ణు వర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సీఎంను హత్య చేస్తారని వైసీపీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదన్నారు. Also read: రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం… సీఎం ను కాపాడుకోలేని వాళ్లు ప్రజలను ఎలా కాపాడుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు…
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును…
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ…
రాష్ట్రంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా బీజేపీ నేతలు గవర్నర్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపారన్నారు. మొహం మీద కొట్టినట్టు అంత బాగుంది అని రైతులు వారికి సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. 5,447 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.…
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 317పై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్న ఆయన.. ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనం అని మండిపడ్డారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. సీఎం కేసీఆర్.. సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయలబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని విమర్శించారు..…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు చేశారు. నేడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ.. బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డిజీల్, గ్యాస్, వంట నూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజల సంక్షేమాల గురించి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయంలో…
తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఈడీ నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెట్టారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీలోకి ఎవ్వరు వచ్చిన చేర్చుకుంటామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ర్టంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే…