వానకాలం పంటతో పాటు యాసంగి పంటను కూడా కొనుగోలు చేయాలని కోటి సంతకాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు తీరుకు నిరసనగా ఢిల్లీలో రైతులు నిరసనలు చేశారు దెబ్బకు మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు… అదే విదంగా రాష్ట్రంలో కూడా రైతులు ఆందోళన లు చేయాలి. 7 సంవత్సరాల మోడీ ప్రభుత్వం లో ఒక్క ఎఫ్సిఐ గోదాం నిర్మించలేదు అంటే ఈ ఎఫ్సిఐ ని కూడా ప్రైవేట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఢిల్లీలో రైతుల మాదిరిగానే తెలంగాణ రైతాంగం నిరసనలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు చేయాలని రాష్ట్ర రైతాంగంకు విజ్ఞప్తి చేస్తున్న. గత 4,5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఈ కేంద్ర ప్రభుత్వం పై విమర్శించమా… ఎందుకు ఇప్పుడే ఇలా చేస్తున్నాము అంటే రైతులను అయోమయంలో పడేశారు కాబట్టి చేయాల్సి వస్తుంది పేర్కొన్నారు.