కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 లకు పెరిగిందని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం పడుతుందని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.
దేవుని పేరు చెప్పి..బిజెపి ప్రభుత్వం రాజకీయ చేస్తుంటే… తెలంగాణ పేరు చెప్పుకొని.. టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆగ్రహించారు జగ్గారెడ్డి. వరి ధాన్యం కొనబోమని కేంద్రం అంటే, వరి వేయొద్దని టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఈ అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు జగ్గారెడ్డి.