కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఔరంగజేబుల వ్యవహరిస్తే శివాజీల సమాధానం చెప్తాం. ఊసరవెల్లిల కేసీఆర్ వ్యవరిస్తున్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవ?ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోటిికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగులు ఇబ్బందులూ పడుతున్నారు అని తెలిపారు.
ప్రభుత్వము ఇచ్చిన 317 జీవో తో టీచర్లు ఇబ్బందులూ పడుతున్నారు. 2018 ఆగస్ట్ 30న కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అప్పటి నుండి నిద్రపోయిన కేసీఆర్ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారు ఉద్యోగ సంఘాలు ఏడపోయారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏడుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు.