వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ సర్కార్ సన్నద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్…
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు. గతంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే…
వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నిప్పులు చేరిగారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని, హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొలగించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో…
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస నెలకొంది. దీంతో నిరసనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగానికి బీజేపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని.. టీఆర్ ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడం పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్ ఎస్, భారతమాతాకి జై అంటూ బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశాయి.…
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 లకు పెరిగిందని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక…
అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగుతలలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు ను పెట్టండి అని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పామని, హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు. ఏపీ…
సమంత నటించిన పుష్ప ఐటెం సాంగ్ పై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పాటపై వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్… తాజాగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. డివోషనల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్ తరహా లో రాయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని లేఖ లో పేర్కొన్నారు రాజసింగ్. దేవి శ్రీ ప్రసాద్…
వానకాలం పంటతో పాటు యాసంగి పంటను కూడా కొనుగోలు చేయాలని కోటి సంతకాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు తీరుకు నిరసనగా ఢిల్లీలో రైతులు నిరసనలు చేశారు దెబ్బకు మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు… అదే విదంగా రాష్ట్రంలో కూడా రైతులు ఆందోళన లు చేయాలి. 7 సంవత్సరాల మోడీ ప్రభుత్వం లో ఒక్క ఎఫ్సిఐ గోదాం నిర్మించలేదు అంటే…
అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు. Read Also:అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం…
కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఔరంగజేబుల వ్యవహరిస్తే శివాజీల సమాధానం చెప్తాం. ఊసరవెల్లిల కేసీఆర్ వ్యవరిస్తున్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవ?ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు…