ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించి, కేవలం తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించిందన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరి కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉందన్నారు. 3 రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రమే చెప్పిందని సుచరిత చెప్పారు. Read Also: జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా? కానీ ఇక్కడ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ చెబుతోందన్నారు.…
ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో…
రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నాదని దుయ్యబట్టారు. జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్…
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.…
టీఆర్ ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర నాయకుడు బాబు మోహన్ కామెంట్స్ చేశారు. వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల చేతులో ఉన్న ఓటు వజ్రాయుధం లాంటిదని దిగ్గజ నేతలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లకు సైతం ఓటమి తప్పలేదన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజల శ్రేయస్స కోసం నిలబడని ఎంత గొప్ప నాయకుడైన మట్టి కరువడం ఖాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ది…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ కు మధ్య విభేధాలు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాల్లో, వార్త ఛానెళ్లలో న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వార్తలపై స్వయంగా ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తనకు బండి సంజయ్ మధ్య ఎలాంటి పోటీ ఏమి లేదని…. ఇక్కడ ఏమన్నా సీఎం, మంత్రి పదవులు ఉన్నాయా… నేను ఎప్పుడు గ్రూప్ లు కట్టలేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.…
నాకు హుజురాబాద్ నియోజకవర్గం ఉందని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ధాన్యం విషయంలో కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రం పై మోపుతున్నాడని ఈటల అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వాళ్ల మంత్రుల మాటలను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఇంత నీచంగా హరీష్‌రావు ప్రవర్తిస్తారని తెలంగాణ ప్రజలకు తెల్సింది. ప్రాంతీయ పార్టీల్లో వారసులే సీఎంలు అవుతారు. బీజేపీ…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శల దాడికి దిగారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ప్రజలకు ఉన్న సోయి రాజకీయ నాయకులకు లేకుండా పోయిందన్నారు. ప్రగతి భవన్‌కు కేసీఆర్ మముల్ని రానియలేదు…. ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యారు. మళ్ళీ ఉద్యమం కరీంనగర్ నుండే పుడుతుందని ఈటల అన్నారు. రైతుబంధుఉన్నోళ్లకు ఇవ్వొద్దని అన్న… డబ్బులు చెట్లకు కాయవు. రైతు కూలీలకు,…
నరసరావుపేట పార్లమెంట్‌పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు? జీవీఎల్ ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారా? GVL నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం…
బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్‌లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్ఎస్ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై…