వానాకాలంలో పండిన ప్రతి గింజ కొనాల్సిందేనని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగ హక్కు ప్రకారం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల అవసరాలకు పోను.. మిగిలిన బియ్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మాటమారుస్తోందని, కేంద్రంపై నమ్మకం లేదని బియ్యం కొంటామని రాత పూర్వకంగా హామీ ఇవ్వాలన్నారు. పండిన ప్రతిగింజను కూడా కొనాల్సిందేనని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం…
యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా,2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో 300లకు పైగా…
సిద్ధిపేట జిల్లా కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాద వశాత్తు మృతిచెందిన ఆంజనేయులు కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పరామర్శించి, యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు.మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు ఐదు నిమిషాలపాటు నీటిలో మునిగి ఉండగలిగిన వ్యక్తి అని ఈటల అన్నారు. ఆంజనేయులు ఎలా చనిపోయాడో నిగ్గు తేల్చి, ఆర్థికంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేడు పోలీస్ల పహారతో…
బీజేపీవి మొత్తం చీప్ ట్రిక్స్ రాజకీయాలేనని… మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర్వపడాలని.. బీజేపీ అధ్యక్షుడు చేయబోయే దీక్ష ఎందుకో చెప్పాలి, యువకులు బీజేపీ చేస్తున్న ట్రిక్స్ గమనించాలని కోరారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. 14 లక్షల మంది వలస వెళ్లే పాలమూరు జిల్లాకు…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఆ వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సుమారు ఏడాది పాటు నిరసనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వాటిని రద్దు కూడా చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ వ్యవసాయ చట్టాలను తీసుకువస్తుందని,…
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రేపటి బీజేపీ నిరుద్యోగ దీక్ష పై ఆంక్షలు విధించారు పోలీసులు. హై కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కానీ జనవరి 2 వరకు రాష్ట్రం లో బహిరంగ సభలు, ర్యాలీ లు నిషేధం అంటూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే దీక్ష కు పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసింది.…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ రేడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం…
బిజెపి నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్లో ఓ పోల్ క్వశ్చన్ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు.…
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న చేసిన పని… దుర్మార్గమని విమర్శించారు. చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అల్లం నారాయణ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు…
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా నడుస్తోంది. జనం దృష్టిలో వీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారనేది బహిరంగం రహస్యం. బహుశా అందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరచూ వీరిది మ్యాచ్ ఫిక్సింగ్ బంధమని ఎగతాళి చేస్తుంటుంది. రహస్య స్నేహితులని ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు అంశంపై రెండు పార్టీలు చేస్తున్న హంగామా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఖరీఫ్…