కరీంనగర్‌లో రేపు రాత్రి 9 గంటల నుంచి 3 జనవరి ఉదయం 5 గంటల వరకు జాగరణ చేయాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హజరవుతారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు, పోలీసులకు, టీచర్లకు బదిలీలకు సంబంధించిన 317 జిఓ ఉద్యోగ సంఘాలతో చర్చించి సవరించాలని డిమాండ్ చేస్తు జాగరణ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: నుమాయిష్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళ సై
ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ జాగరణ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరరాఉ. ఉద్యోగుల కోసం పోరాటం చేయడానికి వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ జీఓను సవరించే వరకు బీజేపీ ఉద్యోగులకు మద్దతుగా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు.